ఖరీదైన కలప అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ఎర్రచందనం, గంధపు చెక్క, టేకులాంటివే ..

వీటికంటే అత్యధిక ధరపలికే కలప ఒకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ వుడ్… ఇది ఎర్రచందనం, గంధపు చెక్కల ధరకంటే చాలా ఎక్కువ. బంగారం కంటే ఖరీదైనది..

ఆఫ్రికాలో ఎక్కువగా ఉండే  ఈ బ్లాక్ వుడ్  25 అడుగుల నుండి 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.. ఇవి పొడి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి..

ఆఫ్రికన్ కలపతో క్లారినెట్,గిటార్, వంటి సంగీత వాయిద్యాల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు.

బ్లాక్ వుడ్ చెట్టు నుండి మంచి చేవతేలిన కలప రావాలంటే 60 సంవత్సరాలు పడుతుంది.

గృహోపకరాణాలు..సంగీత వాయిద్యాలు తయారీలో ఈబ్లాక్ వుడ్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఒక కిలో బ్లాక్ వుడ్ ధర 8వేల పౌండ్లు ఉంటుంది. అంటే అక్షరాల 7లక్షల రూపాయలు..

కెన్యా, టాంజానియా, ఆఫ్రికన్ దేశాలలో.. స్మగ్లర్ల కన్ను ఈ బ్లాక్ వుడ్ పై పడింది..

స్మగ్లర్ల కన్ను ఈ బ్లాక్ ఉడ్ పై పడటంతో ప్రస్తుతం ఆయా దేశాలలో బ్లాక్ వుడ్ చెట్లు అంతరించి పోతున్న వృక్షజాతుల జాబితాలో చేరాయి.