ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణకోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
భారత్‌లో అంతరించిపోయిన చీతాలను తిరిగి వృద్ధిచేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
భారత్‌లో 1947లో చివరి చిరుత పులి మరణించింది.
అయితే.. దేశంలో అవి అంతరించిపోయినట్లు 1952లో అధికారికంగా ప్రకటించారు.
70ఏళ్ల తరువాత చీతాల దిగుమతికి నమీబియాతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
నమీబియా నుంచి ఎనిమిది చిరుత పులులు (ఐదు మగ, మూడు ఆడ) ఇండియాకు రానున్నాయి.
17న ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య రాజస్థాన్ రాజధానిలో కార్గో విమానంలో భారత్‌కు చేర
ుకుంటాయి.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భోపాల్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తరలిస్తారు.
ఎనిమిది చిరుతలను భారత్ కు కార్గో ఎయిర్ క్రాప్ట్ లో తరలించనున్నారు.
నమీబియా నుంచి ఖాళీ కడుపుతోనే కేపీఎన్‌పీకి చిరుతలను తరలించనున్నారు
.