మన శరీరంలో కొలెస్ట్రాల్‌లో  మంచి, చెడు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ అయినా.. మంచి కొలెస్ట్రాల్‌ అయినా  ఉండాల్సిన శాతంలో  ఉండాలి..

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగితే గుండె సంబంధిత జబ్బులు తప్పవు..బరువు కూడా పెరుగుతారు. ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో సతమతమవుతున్న వాళ్ళు ఐదు రకాల పండ్లను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్లు అన్నీ సిట్రస్ పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచుతాయి..

ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయి రక్తపోటుని నియంత్రించి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది.

విటమిన్స్ ఎ, బి, సి, కె ఉంటే టమాటా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెకి మేలు చేస్తుంది.

కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి అవకాడో చక్కటి మార్గం. అవకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వులు, 4 గ్రాముల ఫైబర్ లభిస్తాయి.

క్యారెట్ తింటే రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయ.. రిఫ్రెషింగ్ పండు.  కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ..  సహాయపడుతుంది.