చిన్న వయసులోనే జట్టురాలడం సాధారణమైపోయింది.
మందార పువ్వుల టీ ద్వారా జుట్టురాలడాన్ని అరికట్టవచ్చు.
శరీరంలో వేడి ఎక్కువైనా జుట్టు రాలడం అధికంగా ఉంటుంది.
శరీర వేడిని తగ్గించడంలో మందార టీ పనిచేస్తుంది.
ఈ మందార టీ ని ఇంటివద్దనే మనం తయారు చేసుకోవచ్చు.
తాజాగా ఉన్న ఎర్రమందార పువ్వు రేకులను గిన్నెలోకి తీసుకోవాలి.
అవి మునిగేలా నీళ్లుపోసి పది నిమిషాలు నానబెట్టాలి.
వాటిలో టీస్పూను గ్రీన్ టీ పోసి పది నిమిషాలు మరిగించాలి.
మరిగిన నీటిని వడగట్టి వేడిగా ఉన్నప్పుడే తాగాలి.
రోజూ ఈ టీ తాగడం వల్ల శరీరానికి విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లేవనాయిడ్స్, ఎమినో యాసిడ్స్ అందుతాయి
ఈ విధానంతో జట్టు రాలడం తగ్గుతుంది.