గత సీజన్లతో పోలిస్తే దారుణంగా పడిపోయిన బిగ్‌బాస్ రేటింగ్
బిగ్‌బాస్ షోకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నాగార్జున హోస్ట్ గా ఇటీవలే ఆరో సీజన్ ని మొదలుపెట్టారు.
అయితే బిగ్‌బాస్ పై ప్రేక్షకులకి గతంలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు లేదని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ సారి కంటెస్టెంట్స్ గురించి అంతగా హంగామా లేదు, అంతేకాక గత సీజన్లతో పోలిస్తే లాంచింగ్ ఎపిసోడ్ రేటింగ్ ఈసారి బాగా తక్కువ వచ్చింది.
బిగ్‌బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ చేయగా లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 16.18 వచ్చింది.
బిగ్‌బాస్ సీజన్ 2 నాని హోస్ట్ చేయగా లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 15.05 వచ్చింది.
బిగ్‌బాస్ సీజన్ 3 నుంచి వరుసగా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 17.92 వచ్చింది.
బిగ్‌బాస్ సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 18.50 వచ్చింది.
బిగ్‌బాస్ సీజన్ 5 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 15.70 వచ్చింది.
బిగ్‌బాస్ సీజన్ 6 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 8.86 వచ్చింది. గత సీజన్ల కంటే చాలా తక్కువ రావడం గమనార్హం.
అయితే సీజన్ 6 ప్రారంభం రోజే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉండటం వల్ల దీని టీఆర్పీ రేటింగ్ తగ్గిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.