కొంతమంది ఉదయం నుంచి ఏమీ తినకపోయినా ఆకలికావటం లేదని అంటుంటారు.
అలాంటి వారు సరిగా తినక నీరసం అయ్యి పలు సమస్యలతో బాధపడుతుంటారు.
ఆకలి పెరగాలంటే ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ఒక టీ స్పూన్ బెల్లం పొడిని అర టీస్పూన్ నల్ల మిరియాల పొడితో కలిపి నిత్యం ఒక పూట తీసుకోవాలి.
అర టీ స్పూన్ అల్లం రసంలో కొద్దిగా రాక్‌సాల్ట్ కలిపి పది రోజులు భోజనానికి అర్ధ గంట ముందు తీసుకోవాలి.
కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల ఉసిరి రసం, రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల తేనె కలిపి ఆ
మిశ్రమాన్నిపరిగడుపునే తీసుకోవాలి.
రోజూ భోజనం చేసే ముందు 2, 3 యాలకుల గింజలను నమిలి మింగాలి. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.
ఒక టీ స్పూన్ నిమ్మ రసంలో రెండు టీ స్పూన్ల వాము కలిపి ఈ మిశ్రమాన్ని ఎండబెట్టాలి.
దానిలో కొంత నల్ల ఉప్పును కలపాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి.
ద్రాక్షలో చాలా తక్కువగా యాసిడ్స్ ఉండి జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీంతో ఆకలి పెరుగుతుంది.
భోజనానికి భోజనానికి మధ్య ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.