ఆధార్ కార్డ్‌లో ఫోటోను ఎలా అప్‌డేట్ చేయాలంటే?

అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను uidai.gov.in విజిట్ చేయండి. 

వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను సెర్చ్ చేయండి. డౌన్‌లోడ్ చేయండి.

ఫారమ్‌లో అన్ని వివరాలను పూరించండి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సర్వీసు కేంద్రానికి సమర్పించండి.

ప్రస్తుతం ఆధార్ ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా అన్ని వివరాలను నిర్ధారిస్తారు.

ఆ తర్వాత, ఎగ్జిక్యూటివ్ మీ ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేసే కొత్త ఫొటోను క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

ఆధార్ సర్వీసు కోసం GSTతో పాటు రూ. 100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 

ఆధార్ ఎగ్జిక్యూటివ్ రసీదు స్లిప్, అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) అందిస్తారు.

UIDAI వెబ్‌సైట్‌లో URN నంబర్‌ని ఉపయోగించి మీ లేటెస్ట్ ఆధార్ కార్డ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు