కిడ్నీలు మన శరీరంలో ఎంతో కీలకమైనవి.

 మనం తీసుకునే ఆహారం, నీటితోనే మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటుంది.

కిడ్నీల స‌మ‌స్య‌ తీవ్రంగా ఉన్నప్పుడు ఉప్పు చాలా వరకు తగ్గించాలి. 

 మాంసకృత్తులు తక్కువగా తీసుకోవాలి. నీటిని లీటరు కంటే ఎక్కువగా తీసుకోవాలి.

టమాట, పాలకూరతో కొంతమందికి రాళ్లు వస్తాయి. అనుమానిత లక్షణాలున్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి.

రోజువారీ వంటల్లో అల్లం, పసుపు తప్పనిసరిగా వాడుకోవాలి. 

కొత్తిమీరకు రక్తనాళాల్లో ఆటంకాలను నిలువరించే శక్తి ఉంటుంది.

పెరుగు, బెర్రీ పండ్లు, బీన్స్‌, గుమ్మడి విత్తనాలు, నువ్వులు తరచుగా తీసుకోవాలి.

వంటల్లో ఆలీవ్‌ నూనెను వాడుకుంటే మేలు చేస్తుంది.

డయాలసిస్‌కు వెళ్లినవారు.. సాధారణ వ్యక్తుల కంటే 20-30 శాతం ఎక్కువగా ప్రోటీన్లు తీసుకోవాలి.

కిడ్నీల మార్పిడి జరిగిన వారు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి.

ఇంట్లో తయారు చేసిన వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం.

కారం, మసాలాలను బాగా తగ్గించుకోవాలి. సిగరెట్‌ను పూర్తిగా మానేయాలి. 

కాఫీ, టీ తగ్గించాలి. పెయిన్‌ కిల్లర్లు అధికంగా వాడొద్దు.