అవకాడో నూనె జుట్టు రాలే సమస్యకు సమర్థంగా చెక్ పెడుతుందంటున్నారు నిపుణులు.
అవకాడో నూనెలో ఉండే ఓలియిక్ అనే ఫ్యాటీ ఆమ్లాలు..ఇందులో ఉండే పోషకాలు ఇతర జుట్టు సమస్యలకు చెక్ పెట్టి కేశాలకు సంపూర్ణ పోషణ అందిస్తాయంటున్నారు.
ఈ నూనెలో ఉండే ‘ఇ’, ‘డి’ విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఈ నూనె జుట్టు సమస్యల్ని దూరం చేసి కేశ సౌందర్యాన్నిపెంచుతుంది..
అవకాడో నూనెలో ఉండే ఓలియిక్ ఆమ్లాలు, మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు కుదుళ్లలోకి ఇంకి.. జుట్టుకు తేమనందిస్తాయి. తద్వారా జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి.జుట్టుని స్మూత్ గా చేైస్తుంది..
చిక్కు పడిన జుట్టు కాస్త అవకాడో నూనె రాస్తే చిక్కు తేలిగ్గా వచ్చేస్తుంది. కేశాలకు కండిషనర్‌గానూ పనిచేస్తుంది.
నూనెలో ఉండే ‘బి’, ‘ఇ’.. విటమిన్ల వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.
చుండ్రు చెక్ పెడుతుంది అవకాడో నూనె. తలస్నానం చేయడానికి కొన్ని గంటల ముందు ఈ నూనెతో కుదుళ్లకు మర్దన చేస్తే రక్తప్రసరణ మెరుగై జుట్టు పెరుగుదలనూ ప్రేరేపిస్తుంది.
అవకాడో నూనెను నేరుగా కాకుండా.. కొన్ని అత్యవసర నూనెలతో కలుపుకొని వాడితే జుట్టు రాలడం తగ్గి.. మరింత వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
అవకాడో నూనెలో కొన్ని చుక్కల రోజ్‌మేరీ లేదా పెప్పర్‌మెంట్ ఆయిల్ కలుపుకొని.. కుదుళ్లకు మర్దన చేస్తే చర్మ రంధ్రాల్ని తెరుచుకునేలా చేసి కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది.