మనం తినే ఆహారంలో ఎండు పనస పొడిని వాడడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

ఎండు పనస పొడి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.

శ్రీకాకుళం వైద్య విజ్ఞాన సంస్థ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

తరచూ పనస పొట్టును ఆహారంలో తీసుకోవడం ద్వారా బ్లడ్‌షుగర్‌ నియంత్రణలో ఉంటుంది.

మలబద్ధకం వంటి సమస్యలు దూరమైనట్లు పరిశోధనల్లో తేలింది.

పనసను ఎండబెట్టి పౌడర్‌ రూపంలో ఆహార పదార్థాల్లో కలిపి తీసుకుంటే మేలు

శ్రీకాకుళంలో ఉన్న ప్రభుత్వ వైజ్ఞానిక సంస్థలో టైప్‌ టూ డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిని పరీక్షించారు.

18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సుగల 40 మందిని రెండు గ్రూప్‌లుగా విభజించి పరిశోధనలు చేశారు.

ఒక గ్రూపు వారికి భోజనానికి ముందు పచ్చి పనస పొట్టును 12 వారాలు అందించారు.

పచ్చి పసన పొట్టు తీసుకోని వారితో పోల్చితే, టైప్‌ టూ డయాబెటిస్‌ మెలిటస్‌ రోగుల్లో గ్లైసిమిన్‌ నియంత్రణలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.