మరో ప్రాణాంతక కొత్త వైరస్ ను గుర్తించిన అమెరికా సైంటిస్టులు.
ఖోస్తా-2 గా పిలిచే ఈ వైరస్ రష్యా గబ్బిలాల్లో కనుగొన్నారు.
ఈ కొత్త వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్లు తేల్చారు.
ఇది కూడా కొవిడ్ లాంటి వైరస్ అని చెప్పారు.
కరోనా తరహాలోనే ఇది కూడా మనిషి కణాల్లోకి ప్రవేశిస్తుందని చెప్పారు.
ఖోస్తా-2 వైరస్ కరోనా కంటే ప్రమాదకరం అని హెచ్చరించారు సైంటిస్టులు.
ఇది కరోనా వైరస్ లోని ఉపవర్గానికి చెందినది.
ఈ కొత్త వైరస్ పై.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలేవీ ఎలాంటి ప్రభావం చూపడం లేదు.
ఈ వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవన్న సైంటిస్టులు.