సైంధవ లవణం.. హిమాలయన్ క్రిస్టల్ సాల్ట్ అని పిలుస్తారు.
హిమాలయ పర్వత ప్రాంతంలో లభిస్తుంది.
ముదురు నీలం, ఊదారంగు, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో దొరుకుతుంది.
ఈ రాతి ఉప్పు ఉత్తమమైనదని ఆయుర్వేదం చెబుతుంది.
ఎలాంటి రసాయనాలు ఉండవు.
సాధారణ ఉప్పుకు ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
ఇందులో అయోడిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది.
మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు దీనిలో ఉంటాయి.
సైంధవ లవణం నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచటానికి..
శరీరం నుండి కోల్పోయే ఖనిజాలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది.