ఫ్యాషన్ మారిపోయింది.. కనుబొమలు ఒత్తుగా కనిపించడమే ఇప్పడు ట్రెండ్. 

కొందరిలో కనుబొమలు చాలా పలుచగా ఉంటాయి.. కనుబొమలను సహజంగా ఒత్తుగా పెంచుకోవచ్చు.

ప్రతి రెండు రోజులకోసారి ఇలా చేయాలి. రాత్రంతా ఉంచుకోవచ్చు. జిడ్డు అనిపిస్తే అరగంట తర్వాత కడిగేయొచ్చు.

 స్పూను తాజా ఉల్లిరసానికి కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. దూదితో కనుబొమల ప్రాంతంలో రాసి ఆరనివ్వాలి.

పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరి. జాగ్రత్తగా రాసుకోవాలి. ప్రతి రెండు రోజులకోసారి ఇలా చేయాలి. 

కోడిగుడ్డులోని పసుపు సొనా కనుబొమల వెంట్రుకల పెరుగుదలలో సాయపడుతుంది. 

పసుపు సొనకు కొన్నిచుక్కల నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. దాన్ని కనుబొమలకు రాసి 20 నిమిషాలు ఆరనిస్తే సరి.

అలోవెరా చెక్కు తీసి నేరుగా కనుబొమలను రుద్ది, ఆరనిచ్చి కడిగినా ఫలితం ఉంటుంది.

పాలల్లో ముంచిన దూదితో కనుబొమలపై అద్దాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయండి.

పాలకి తేనెను చేర్చినా మంచి ఫలితం ఉంటుంది.