రోజుకు రెండు సార్లు ఛీజ్, పెరుగు లేదా గుడ్లు తింటే మధుమేహం వచ్చే అవకాశం తక్కువ. 

కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు.

రోజుకు రెండు సార్లు పాల పదార్థాలు తీసుకోవాలి.

రక్తపోటు, గుండె జబ్బుతో ముడిపడిన సమస్యలూ తగ్గుతున్నట్లు కనుగొన్నారు. 

ఈ అధ్యయనంలో మొత్తం 21 దేశాలకు చెందిన 1.4లక్షల మందిని పరీక్షించారు.

వారి ఆహార అలవాట్లను తొమ్మిదేళ్ల పాటు పరిశీలించారు.

 పెరుగు వంటి పాల పదార్థాలు తీసుకోవటానికి జీవక్రియ రుగ్మత (మెటబాలిక్ సిండ్రోమ్) తగ్గటానికీ మధ్య సంబంధం ఉంటున్నట్లు తేల్చారు.

మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ కిందకే వస్తాయి. 

పాల పదార్థాలను రోజుకు రెండు సార్లు తినేవారిలో జీవక్రియ రుగ్మత 24శాతం మేరకు తగ్గుతున్నట్లు బయటపడింది. 

వీటిల్లోనూ ఇది రుజువైనట్లయితే తక్కువ ఖర్చుతోనే అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులను తగ్గించుకొనే అవకాశముంది.