సపోటా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కటి రుచితో పాటు ఆరోగ్యప్రయోజనాలను ఇచ్చే చక్కటి పండ్లు సపోటాలు..

బలహీనంగా ఉన్నప్పుడు రెండు..మూడు సపోటా పండ్లు తింటే.. నిమిషాల్లో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుంది.

సపోటా పండు శరీర ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రిస్తుంది.

సపోటా పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.

కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల, సపోటా పండు ఎముకల గట్టితనానికి, విస్తరణకు బాగా సహాయ పడుతుంది.

స‌పోటాలో ఉండే విటమిన్‌ 'A' కంటిచూపును మెరుగుపరుస్తుంది.

విటమిన్‌ 'C'శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

సపోటాలో ఉండే సోడియం , పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయి.  గర్భవతులకు, పాలిచ్చే తల్లులు స‌పోటా చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది.

గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.