మునుగోడు నియోజకవర్గ ఉప పోరుకు నగారా మోగింది.

7వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

నియోజకవర్గం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలను కలుపుకొని ఉంటుంది.

ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల పరిధిలో నియోజకవర్గం విస్తరించి ఉంది.

మునుగోడు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం.

మొత్తం ఓట్లు  2,27,265  ఉన్నాయి.

1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది.

మొత్తం 12సార్లు ఎన్నికలు జరిగాయి.

ఆరుసార్లు కాంగ్రెస్‌, అయిదుసార్లు సీపీఐ, ఒకసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

1967 నుంచి 1985 సంవత్సరం వరకు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విజయం సాధించారు.

1985 నుంచి సీపీఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

1999లో కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విజయం సాధించారు.

2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డి గెలుపొందారు.

2009 ఎన్నికల్లో సీపీఐ నుంచి ఉజ్జిని యాదగిరిరావు పోటీచేసి గెలుపొందారు.

2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు.

2018 సంవత్సరంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు.