82 ఏళ్ల ఫ్రెంచ్‌ రచయిత్రి అనీ ఎర్నాక్స్‌ను వరించిన ‘నోబెల్‌ పురస్కారం’..

121 ఏళ్ల నోబెల్‌ ప్రైజ్‌ చరిత్రలో సాహిత్యంలో 115 అవార్డుల్ని ప్రదానం చేయగా..  వారిలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోనున్న 17వ మహిళగా నిలిచిన ఫ్రెంచ్‌ రచయిత్రి అనీ ఎర్నాక్స్.

1940లో నార్మాండీలోని యెవెటోట్‌ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్‌ పుట్టి పెరిగిన యెవెటోట్‌ అనే చిన్న పట్టణంలో తల్లిదండ్రులతో కలిసి కేఫ్‌ను నడిపారు..

చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ఎర్నాక్స్ 2000లో టీచింగ్‌ వదిలిపెట్టి..  పూర్తి కెరీర్‌ను రచనలకే అంకితం చేశారు.

కల్పిత కథలు, ఆ తర్వాత ఆత్మకథలపై పట్టు సాధించిన ఆమె.. తన స్వీయానుభవ రచనలతో అశేష పాఠకాభిమానుల్ని సంపాదించుకున్నారు.

శారీరక, మానసిక, లైంగికత వంటి సున్నితమైన అంశాలనే కథాంశాలుగా తీసుకొని సరళమైన రీతిలో రచనలు చేయడంలో అనీ దిట్ట..

స్వీయానుభవాలు, తన చుట్టూ జరుగుతోన్న సంఘటనల్ని తన రచనల్లో ప్రతిబింబించడం ఆమె ప్రత్యేకత..

18 ఏళ్ల వయసులో  ఎదురైన లైంగిక అనుభవం.. తదనంతర పరిణామాలను ప్రధానాంశంగా చేసుకుని  ‘ఎ గర్ల్స్‌ స్టోరీ’ అనే బుక్ రాశారు..

23 ఏళ్ల వయసులో స్వీయ గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన అనుభవాలను ‘హ్యాపెనింగ్‌’ బుక్ లో కళ్లకు కట్టారు.. తన ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ‘గెట్టింగ్‌ లాస్ట్‌’ బుక్ లో వివరించారు.

తన టీనేజ్‌ అనుభవాలు, అల్జీమర్స్‌ వ్యాధి, తల్లి మరణం, రొమ్ము క్యాన్సర్‌.. వంటి అంశాలపై ఎన్నో పుస్తకాలు రాసిన ఎర్నాక్స్ తన 22 ఏళ్ల సాహిత్య కెరీర్‌లో సుమారు 30కి పైగా రచనలు చేశారు..

అనీ ఎర్నాక్స్ ‘ది ఇయర్స్‌’కి ‘Prix Renaudot’ అవార్డు అందుకున్నారు. ఈ పుస్తకమే 2019లో ప్రతిష్టాత్మక ‘మ్యాన్‌ బుకర్ ప్రైజ్‌’ లిస్టుకు ఎంపికైంది..

అలా సాహిత్య రంగంలో ఎర్నాక్స్  చేసిన సేవలకు సాహిత్యం విభాగంలో ప్రతిష్టాత్మక ‘నోబెల్‌ బహుమతి’ సైతం ఆమె సొంతమైంది..