రాజకీయాల్లో పాదయాత్ర అనేది చాలా ప్రధాన్యత సంతరించుకుంది. పాదయాత్రలు చేసి అనుకున్న ఫలితాలను రాజకీయ పార్టీలు సాధించగలిగాయి. సాధిస్తన్నాయి కూడా. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఐదు పాదయాత్రలను ప్రముఖంగా చెప్పుకోచవ్చు.

సోషలిస్ట్ నేత చంద్రశేఖర్, 1983లో భారత్ యాత్ర పేరుతో 4,200 కి.మీ పాద యాత్ర చేశారు.

2003లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 1,500 కి.మీ పాద యాత్ర చేశారు.

2013లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, 2,800 కి.మీ పాద యాత్ర చేశారు.

వైఎస్ కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2017లో 3,648 కి.మీ పాద యాత్ర చేశారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, 2017లో 3,300 కి.మీ పాద యాత్ర చేశారు.

ఈ యాత్రలన్నీ సరిగ్గా ఎన్నికలకు ముందు చేసినవే. ఈ యాత్రల అనంతరం జరిగిన ఎన్నికల్లో సంబంధిత పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే దేశంలో పేరుగాంచిన ఈ ఐదు యాత్రల్లో మూడు తెలుగు రాష్ట్రాల్లోనే జరగడం విశేషం.