ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా స్వీకరించే ముందు అసలు ఆ ఆధార్ కార్డ్ ఒరిజినలో కాదో చెక్ చేయండి. 

https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar పోర్టల్ లో..

ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయడం ద్వారా అసలు ఆ ఆధార్ కార్డ్ ఒరిజనలో కాదో తెలిసిపోతుంది.

మీ ప్రమేయం లేకుండా ఆధార్‌కు సంబంధించి వచ్చే ఓటీపీని ఎవరితో షేర్ చేయకూడదు.

ఇంటర్నెట్ సెంటర్‌లో లేదా పబ్లిక్ కంప్యూటర్‌లో ఇ-ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేశారా? 

ప్రింట్ తీసుకోగానే ఇ-ఆధార్ ఫైల్ డిలీట్ చేయండి.

లేకపోతే మీ వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో మీ ఆధార్ వివరాలను లాక్ చేయొచ్చు.

ఎవరికైనా మీ ఆధార్ నెంబర్ తెలిసినా వాటిని ఉపయోగించలేరు.

ఆధార్ తో కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయించాలి.

మొబైల్ నెంబర్ మాత్రమే కాదు ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్న ఇ-మెయిల్ అడ్రస్‌ను కూడా అప్‌డేట్ చేయాలి.