మనం ప్రతిరోజూ ఉదయాన్నే పళ్లు తోముకుంటాం.

ఉదయాన్నే బ్రష్ చేయడం ద్వారా దంతాల్ని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.

బ్రషింగ్‌ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిర్లక్ష్యం చేస్తే పళ్లు-చిగుళ్ల సమస్యలతో పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. 

ఉదయం, రాత్రి వేళల్లో రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటే మంచిది. 

తద్వారా చిగుళ్లు ప్రేరేపితమై వాటికి సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

బ్రష్‌ చేసుకున్న తర్వాత మౌత్‌వాష్‌తో పుక్కిలిస్తే నోటి దుర్వాసన దూరమవుతుంది. 

దంతాల మధ్య ఉండిపోయిన ఆహార పదార్థాల అవశేషాలు, నోటిలో ఉన్న క్రిములు తొలగించుకోవచ్చు.

రెండు-మూడు నిమిషాల పాటు సరైన పద్ధతిలో బ్రష్‌ చేసుకోవాలి. 

ప్రతిఒక్కరూ కనీసం ఆరు నెలలకోసారైనా డెంటిస్ట్‌ని సంప్రదించాలి.

ప్రతిఒక్కరూ కనీసం ఆరు నెలలకోసారైనా డెంటిస్ట్‌ని సంప్రదించాలి.