సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు.

కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ములాయం సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ములాయం 1939 నవంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫాయ్ గ్రామంలో జన్మించారు. 

ములాయం తల్లిదండ్రులు మూర్తి దేవి, సుగర్ సింగ్ యాదవ్ 

ములాయం మొదట రెజ్లర్, టీచర్‌గా కొనసాగారు. 

1967లో 28 ఏళ్ల వయసులోనే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

10సార్లు ఎమ్మెల్యేగా, ఏడు సార్లు ఎంపీగా విజయం సాధించాడు. 

1989లో తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

1992లో ములాయం సమాజ్ వాదీ పార్టీని స్థాపించాడు. 

1989-1991 వరకు, 1993-1995 వరకు, 2003 నుంచి 2007 వరకు మూడు సార్లు ఉత్తరప్రదేశ్ సీఎంగా ములాయం పనిచేశారు. 

1996 నుంచి 1998 వరకు కేంద్ర రక్షణ మంత్రిగా సేవలందించారు.