మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్టర్‌గా తెరకెక్కించిన తొలి సినిమా ‘నువ్వే నువ్వే’ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీలోని కొన్ని బెస్ట్ డైలాగులు ఇక్కడ చూద్దాం.

అమ్మ, ఆవకాయ్, అంజలి.. ఎప్పుడూ బోర్ కొట్టవు.

ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు.. పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు.

ఆడపిల్ల పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు.. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు.

ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు.. ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని..?

తాజ్ మహల్, చార్మినార్, నాలాంటి కుర్రాడు చూడటానికే.. కొనడానికి మీలాంటి వాళ్లు సరిపోరు.

కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్లు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం.

సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు.. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు.

డబ్బు ఉన్నవాళ్లంతా ఖర్చుపెట్టలేరు.. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనందించలేరు.

నీ జీవితంలో వంద మార్కులు ఉంటే, 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా..?