ఉదయం లేవగానే ముందుగా చేయాల్సిన పని బ్రష్.
మరి బ్రష్ ఎంతసేపు చేయాలో మీకు తెలుసా?
ఎంతసేపు బ్రష్ చేస్తే మంచిదో తెలుసా?
అతిగా బ్రష్ చేస్తే అనర్థమే.
ఉదయం లేవగానే బ్రష్ చేయడానికి కొంతమంది బద్దకిస్తుంటారు.
కొందరు చాలా సేపు బ్రష్ నోట్లో పెట్టుకుని ఉంటారు.
నోట్లోని పళ్లు, చిగుళ్లకు అంటుకుని ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లు తొలగిపోవాలంటే..
కనీసం 3 నుంచి 4 నిమిషాలు బ్రష్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అతిగా, ఒత్తిపట్టి బ్రష్ చేయడం కూడా సరికాదు.
దీనివల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర, చిగుళ్లు డ్యామేజ్ అవుతాయి.