బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి కేవలం 45 రోజుల్లోనే లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. దీంతో సహజంగానే బ్రిటన్‭పై అక్కడి ప్రధానులపై కొంచెం ఆసక్తి పెరిగింది. మరి ఆ విశేషాలు కొన్ని తెలుసుకుందాం..

ప్రధానిగా రాజీనామా చేసిన లిజ్ ట్రస్.. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం పని చేసిన ప్రధానమంత్రి.

ట్రస్ కాకుండా.. మరో ఇద్దరు నేతలు అతి తక్కువ కాలం ప్రధానులుగా ఉన్నారు. ది ఎర్ల్ ఆఫ్ బాత్ రెండు రోజులు, ది ఎర్ట్ వాల్డెగ్రేవ్ నాలుగు రోజులు ప్రధానులుగా ఉన్నారు. అయితే వీరిని ప్రధానుల అధికారిక జాబితాలో లెక్కించరు.

సర్ రాబర్ట్ వాల్పొలె 20 ఏళ్ల 314 రోజుల పాటు బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. ఈయనే బ్రిటన్‭కు అతి ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్నారు.

లిజ్ కాకుండా మరో ఏడుగురు ప్రధానమంత్రులు ఏడాది కాలం కూడా పూర్తి చేయకుండా ప్రధాన పదవిని వదిలేశారు.

ట్రస్‭కి ముందు బోరిస్ జాన్సన్ ప్రధానిగా పని చేశారు. అయితే దేశంలో ఆర్థిక సంస్కరణలు చేయడంలో విఫలమైనందుకు రాజీనామా చేశారు

ట్రస్‭కి ముందు బోరిస్ జాన్సన్ ప్రధానిగా పని చేశారు. అయితే దేశంలో ఆర్థిక సంస్కరణలు చేయడంలో విఫలమైనందుకు రాజీనామా చేశారు

ఇకపోతే.. బ్రిటన్‭ గురించి ఒక వార్త ప్రచారంలో ఉంది. బ్రిటన్ మాజీ ప్రధాని సర్ విన్‭స్టన్ చర్చిల్‭ను చాలా మంది బ్రిటన్లే ఫిక్షన్ అనుకుంటారట. ఈ వాదన ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలో ఉంది.