దీపావళి పండుగ వచ్చేస్తోంది.

పండుగ సీజన్ కావడంతో ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లతో మార్కెట్లు సందడిగా ఉంటాయి. 

వినియోగదారులు పండుగ సీజన్‌లో తమకు నచ్చిన ప్రొడక్టులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 

ఆన్‌లైన్ సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకునేందుకు ట్రిక్స్ వాడుతుంటారు.

ఫ్రీగా దీపావళి బహుమతి స్కామ్‌‌లతో వినియోగదారులను మోసగించే అవకాశం ఉంది.

CERT-In సైబర్ మోసాల గురించి వినియోగదారులను హెచ్చరించింది. 

కొన్ని చైనీస్ వెబ్‌సైట్‌లు ఉచిత దీపావళి కానుకలంటూ  వినియోగదారులకు ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నట్లు గుర్తించారు. 

ఈ లింకులను క్లిక్ చేయడం ద్వారా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ నంబర్లు, యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. 

ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉండాలని కోరుతూ CERT-In ఒక అడ్వైజరీని జారీ చేసింది.