బెల్లీ ఫ్యాట్ , అధిక బరువు సమస్యలకు జీలకర్ర, వాము వాటర్ బెస్ట్ అంటున్న నిపుణులు

జీలకర్ర, వాము రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం మెటబోలిజం వేగవంతం కావటంతోపాటు కొవ్వు కరిగేలా చేయటంలో ఈ వాటర్ బాగా ఉపకరిస్తాయి.

కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి..

రక్తప్రసరణ సక్రమంగా ఉండి గుండె పనితీరును మెరుగు పరచటంలో బెస్ట్ గా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.

ముందుగా జీలకర్ర, వామును నీళ్లలో వేసి బాగా మరిగించాలి.

ఈ నీళ్లు చల్లారిన తరువాత భోజనం తరువాత మధ్యాహ్నం, లేదంటే రాత్రి భోజనం తరువాతైనా తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

ఇలా రోజూ చేస్తే..నెలరోజుల్లోనే శరీరంలో అనేక మార్పులు

వాము, జీలకర్ర వాటర్ లో తక్కువ కేలరీలు ఉండటం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.