మనం తినే ఆహారాలు మన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా?

ఇష్టమొచ్చినట్లుగా ఏది పడితే అది తినేస్తే..  మానసిక ఒత్తిడి పెరుగుతుందంటున్నారు  నిపుణులు..

మనలో ఒత్తిడిని తగ్గించి మంచి మూడ్ ను కలిగించే ఆహారాలు తీసుకోవాలని  సూచిస్తున్నారు నిపుణులు..మరి హ్యాపీ మూడ్ ను కలిగించే ఆహారాలేంటో తెలుసుకుందాం..రండీ..

నట్స్‌లో ఉండే  పోషకాలు  శరీరంలో విటమిన్ల లోపాన్ని తగ్గిస్తాయి..డిప్రెషన్ ను కూడా తగ్గిస్తాయి.. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఫైబర్ కంటెంట్ పుష్కలం ఉండే అరటిపండ్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. రీఫ్రెష్ చేస్తాయి. తక్షణ శక్తి వస్తుంది.

వివిధ రకాల విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ లు పుష్కలంగా ఉండే బీన్స్ శక్తివంతంగా చేయడంతో పాటుగా ఉత్సాహంగా ఉంచుతాయి.

ఓట్స్ బరవును తగ్గించటమే కాదు.. హ్యాపీ మూడ్ ని కలిగిస్తాయి.బరువు తగ్గాలంటే  ఓట్స్  బెస్ట్..బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. ఓట్స్ లో ఉండే ఐరన్ కంటెంట్ శక్తివంతంగా చేస్తుంది.

డార్క్ చాక్లెట్లు తింటే మూడ్ ఆటోమెటిక్ గా ఛేంజ్ అవుతుంది.ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ గా చేస్తుంది.

ప్రతిరోజూ ఒక చాక్లెట్ తింటే పని ఒత్తిడిని నియంత్రించవచ్చు. అధిక శాతం కోకా కలిగి ఉన్న డార్క్ చాక్లెట్, ఒత్తిడిని తగ్గించే 'ఎండార్ఫిన్' ఉత్పత్తి చేస్తాయి.

హాట్ కోకా తాగటం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గటమే కాకుండా, మెదడుకు విశ్రాంతి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.