అలొవెరా జెల్‌, కొబ్బరినూనెను కలిపి బాగా మిక్స్‌ చేసి కుదుళ్లకు పట్టిస్తే జుట్టు పెరుగుతుంది.

2 టేబుల్‌ స్పూన్ల పెరుగు, మరో రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెర జెల్‌ను బాగా కలిపి జుట్టుకు పట్టించి అరగంట పాటు ఉండాలి. ఆరిన తర్వాత కడిగేయాలి.

కేవలం అలొవెరా జెల్‌ను జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. పీహెచ్‌ వాల్యూ బ్యాలెన్స్‌ కావటం వల్ల డాండ్రఫ్‌ పోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఉల్లిపాయలను సన్నగా తరిగి జ్యూస్‌లా మిక్సీలో పట్టాలి. ఆ ఉల్లిపాయ జ్యూస్‌ను జుట్టుకు పట్టిస్తే కొల్లాజిన్‌ పెరుగుదల జరిగి జుట్టు పెరుగుతుంది.

కోడిగుడ్డు సొన, టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ ఆయిల్‌ వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.