పాక్‌పై విజయంతో టీమిండియా కొత్త రికార్డులను నమోదు చేసింది.

2020లో పాకిస్తాన్ 29 మ్యాచ్‌లలో 20 విజయాలను సాధించింది. ఒక సంవత్సరం క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డును పాకిస్తాన్ కలిగి ఉంది. 

పాక్‌పై విజయంతో టీమిండియా ఆ రికార్డును బద్దలు కొట్టింది.

ఈ ఏడాది (2022) భారత్ మొత్తం 29 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో 21 విజయాలను సాధించింది.

టీ20 వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచ్‌లలో భారత్ 6సార్లు పాక్‌పై విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది.

టీమిండియా ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్ మ్యాచ్‌లలో 39వ విజయాన్ని నమోదు చేసుకుంది. 2017లో దాని మునుపటి అత్యుత్తమ 37 విజయాలను అధిగమించింది.

విరాట్ కోహ్లీ పాక్‌పై మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లి (3,794) నిలిచాడు.

 ఆ తరువాతి స్థానంలో రోహిత్ శర్మ(3,741), న్యూజిలాండ్ వెటరన్ మార్టిన్ గప్టిల్ (3,531), పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ (3,231), ఐరిష్ వెటరన్ పాల్ స్టిర్లింగ్ (3,119) ఉన్నారు.

 కంగారూ గడ్డపై టీ20ల్లో 500పైగా పరుగులు చేసిన తొలి ఆస్ట్రేలియా యేతర ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. 

అంతర్జాతీయ టీ20లో వెయ్యి పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా హార్ధిక్ రికార్డు సృష్టించాడు.

పాకిస్థాన్‌పై కోహ్లీ, హార్ధిక్ అయిదో వికెట్ భాగస్వామ్యం (113). టీ20ల్లో పాక్ జట్టుపై ఏ వికెట్‌కైనా టీమిండియాకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం

ఐసీసీ టోర్నీల్లో కోహ్లి 50కిపైగా స్కోర్లు చేసిన సందర్భాలు 24సార్లు. సచిన్ (23)ను అధిగమించాడు.

 పాక్‌పై విజయంతో భారత్‌ ప్రపంచ కప్‌లో రెండు పాయింట్లతో గ్రూప్‌-2లో అగ్రస్థానంలో ఉంది.