తులసి ఆకుల్ని నోటిలో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.

తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోజూ రాత్రి సమయంలో నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి.

పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది.

అల్లంలోని గుణాల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

జలుబు, వైరస్ బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది. 

గొంతు నొప్పితో బాధపడే వారికిసైతం అల్లం ఛాయ్‌ దివ్య ఔషధంగా పనిచేసి వేగంగా ఉపశమనాన్ని ఇస్తుంది.

జలుబు వలన కఫం పేరుకుపోయినపుడు అర లీటర్ నీటిలో స్పూన్ వాముపొడి, స్పూన్ పసుపు వేసి చల్లారాక తేనె కలిపి రోజులో ఎక్కువగా తాగాలి.

మెత్తగా దంచిన వామును ఒక స్పూన్ గ్లాస్ మజ్జిగకు కలిపి తీసుకోవడం వలన ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే మార్గం శుభ్రపడుతుంది.

రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కాస్త పసుపు కలిపి తాగాలి.

దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది. 

కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.