ప్రసవానంతరం మహిళలకు స్ట్రెచ్‌మార్క్స్ వస్తుంటాయి.ప్రసవం అయినవారికే కాదు..బరువు పెరగటం తగ్గుతుండేవారికి కూడా ఉంటుందీ సమస్య..

బరువు పెరగటం.. తగ్గటం.. పని ఒత్తిడి వల్ల కూడా  చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ వస్తుంటాయి.

బరువు పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు చర్మం సాగడం సహజం. సాగిన చర్మం తిరిగి యథాస్థితికి వచ్చినప్పుడు చారలు వస్తుంటాయి. వాటినే స్ట్రెచ్‌మార్క్స్ అంటారు.

నిపునులు సూచించిన మందులు, క్రీంలతో పాటు ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య తొందరగా తగ్గుముఖం పట్టడానికి అవకాశాలున్నాయి..

ఈ సమస్యకి ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే సులువైన పరిష్కారాలున్నాయి..మరి అవేంటో చూసేయండీ..

బంగాళాదుంప ముక్కలతో స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న చోట 10 నిమిషాల పాటు రుద్దాలి. కాసేపు ఆరనిచ్చి నీళ్లతో కడిగేసుకుంటే..ఈ దుంప రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మకణాల ఎదుగుదలను ప్రేరేపించి స్ట్రెచ్‌మార్క్స్ మాయం చేస్తాయి..

రోజూ మాయిశ్చరైజర్ రాసుకుంటే..చర్మం సాగకుండా ఉంటుంది. బరువు పెరిగినా..తగ్గినా చారలు ఏర్పడటం తక్కువగా ఉంటుంది. స్ట్రెచ్‌మార్క్స్ పైన మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద గుజ్జుని స్ట్రెచ్‌మార్క్స్ ఉన్నచోట రాసి అరగంట పాటు మర్దన చేసుకోవాలి. తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే స్ట్రెచ్‌మార్క్స్ పోతాయి. ఇలా తరచు చేస్తుండాలి..

ఆముదం, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్స్ లో ఏదో ఒకదానితో పది నిమిషాల పాటు స్ట్రెచ్‌మార్క్స్ ఉన్నచోట మర్దన చేసుకోవాలి.