ఎయిర్‌టెల్ (Airtel) 5G ప్లస్ సర్వీసులను ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి వచ్చేశాయి.

ఇప్పుడు ఆ నగరాల్లోని మరికొన్ని సర్కిల్‌లలోని ఎక్కువ మంది ఎయిర్ టెల్ యూజర్లకు 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ఆ నగరాల్లోని మరికొన్ని సర్కిల్‌లలోని ఎక్కువ మంది ఎయిర్ టెల్ యూజర్లకు 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ఢిల్లీ, గురుగ్రామ్, చెన్నై వంటి మరిన్ని నగరాల్లోని స్మార్ట్‌ఫోన్‌లలో 5G  సర్వీసులు సపోర్టు చేస్తున్నాయని యూజర్లు  గుర్తించారు.

అక్టోబరు 1న అధికారికంగా ప్రారంభించిన ఎయిర్‌టెల్ తొలిదశలో ఢిల్లీ, ముంబై,  చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలలో 5G  సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

కొన్ని సందర్భాల్లో ఎయిర్ టెల్ యూజర్లు 732Mbps, 465Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌ని పొందవచ్చు.

ఈ 5G స్పీడ్ చెన్నైలో, గురుగ్రామ్‌లో మాత్రమే ఉందని యూజర్లు ట్విట్టర్ పోస్ట్‌లు పెడుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లలో 5G కనెక్టివిటీని పొందిన యూజర్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు  విధించడం లేదు.

ఎయిర్‌టెల్ ముందుగా సూచించినట్లుగా యూజర్లు తమ 4G సిమ్ కార్డ్‌లను మార్చుకోవాల్సిన అవసరం లేదు.