షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన యూనిలివర్. 

తన డ్రై షాంపూ ఉత్పత్తులైన డవ్, ట్రెస్మే, నెక్సస్‌, సువావే, టిగీ లాంటి..

షాంపూల్లో క్యాన్సర్‌ కారక కెమికల్ బెంజిన్ ఉన్నట్లు గుర్తింపు.

మార్కెట్ నుంచి భారీగా వాటిని రీకాల్‌ చేసింది.

కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తులు ప్రమాదకరమని,

వాటిని వాడొద్దని వినియోగదారులను హెచ్చరించింది. 

2021కి ముందు తయారైన షాంపూలో ఈ హానికర కారకాలు ఉన్నాయని ప్రకటన.

బెంజీన్ అధిక స్థాయిలో శరీరంలో చేరితే..

లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్‌ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. 

తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో ఏరోసోల్స్ భద్రత మరోసారి ప్రశ్నార్థకం.