మీనాల్లాంటి అందమైన కళ్లకు ఒత్తయిన కనుబొమ్మలు మరింత అందాన్నిస్తాయి...

వయసు పెరిగే కొద్దీ కనుబొమ్మలూ, కనురెప్పలూ పల్చబడిపోతాయి.

పోషకాహారం సరిగా అందక..హార్మోన్ల అసమతుల్యత, సరైన సంరక్షణ లేకపోవడం, థైరాయిడ్‌ వంటి సమస్యలు యువతుల్లో కూడా కనుబొమ్మలు పల్చబడటానికి కారణం.

ఇటువంటి సమస్యలకు ఆముదం చక్కటి పరిష్కారమని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఐబ్రోస్‌ను సరిచేసుకోవడానికి వాడే స్పూలీ బ్రష్‌ను ఆముదంలో ముంచి కనుబొమ్మలకు పూర్తిగా అంటుకునేలా ఆముదంతో మర్ధనా చేయాలి..

అదే బ్రష్‌తో మస్కరా పెట్టుకున్నట్టు పైన ఇంకా కింది కనురెప్పలకు నెమ్మదిగా ఆముదాన్ని పూసి..రాత్రంతా ఉంచుకొని తెల్లవారి లేచాక కడిగేయాలి.

ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తయిన కనుబొమ్మలు, రెప్పలు సొంతమవుతాయి.