ఏ శుభకార్యమైనా తమలపాకులు ఉండితీరాల్సిందే..విందు భోజనం తర్వాత తాంబూలం సేవించటం సంప్రదాయమే కాదు..ఆరోగ్యం కూడా..అటువంటి తమలపాకులో ఆరోగ్యాన్ని సంరక్షించే సుగుణాలు చాలా ఉన్నాయి..

స్నానం చేసే నీటిలో తమలపాకు ముక్కలు వేసి అరగంట తరువాత స్నానం చేస్తే హాయిగా ఉంటటమే కాదు  రోజంతా చెమట వాసన దరిచేరదు.

తమలపాకు నమలటం వల్ల ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం అవుతుంది. మలబద్ధక సమస్య ఉంటే తగ్గిపోతుంది.

తమలపాకుల్లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలకు మేలు చేస్తుంది.

ఈ ఆకుల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రైబోఫ్లేవిన్‌ నోటిపూత సమస్యల్ని రానివ్వదు..

యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్నందున పుండ్లు, గాయాలు, కాలిన బొబ్బలు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బ్రాంకైటిస్‌, ఉబ్బసం లాంటి శ్వాసకోశ ఇబ్బందులు అదుపులో ఉంచుతాయి..

తమలపాకు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

తలనొప్పి, కడుపులో అల్సర్లు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అన్నింటినీ మించి తాజాదనాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.