మనం తీసుకునే ఆహారం.. మన జీవనశైలి మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల మనం పలు వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. కొన్ని రకాల ఆహారాలు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం..

బ్రోకలీ : ఇది ప్రొస్టేట్, పెద్దపేగు, మూత్రాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.

నారింజ : దీంట్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.

అల్లం : క్యాన్సర్ కణాలను తమంత తాముగా నాశనమయ్యేలా చేస్తుంది. అండాశయ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది.

వెల్లుల్లిలో ఉండే ఎన్నో రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో చక్కగా పనిచేస్తాయి. రొమ్ము, పెద్ద పేగు, పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌లను నిరోధిస్తుంది.

ద్రాక్ష ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. పర్యావరణంలోని విష పదార్థాలు శ్వాస వ్యవస్థకు హాని చేయకుండా ఎలాజిక్ యాసిడ్ రక్షణ కల్పిస్తుంది.

యాపిల్ : రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల నివారణలో యాపిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

సాల్మన్ చేపలు : ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు .. విటమిన్‌లు, ప్రొటీన్లు, సెలీనియం  కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయి. గుండెపోటును కూడా అడ్డుకుంటాయి.

దానిమ్మ రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ..పాలీఫినాల్ క్యాన్సర్ పెరగకుండా చూస్తుంది.

పసుపు క్యాన్సర్‌ను ఇది సమర్థంగా నిరోధిస్తుంది. రొమ్ము, పేగు, చర్మ సంబంధిత క్యాన్సర్ కణాలను ఇది నిర్వీర్యం చేస్తుంది. క్యాన్సర్ కారక కణాలతో ఇది సమర్థంగా పోరాడుతుంది.

మిరియాలు : క్యాన్సర్‌పై పోరాడటానికి మిరియాలు ఫైటర్ లా పనిచేస్తాయి. వీటిలోని క్యాప్‌సైసిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్‌ను కలిగించే కణాలను నిర్మూలిస్తాయి.

క్యారట్ లో క్యాన్సర్‌ను నిరోధించే బయోఫ్లేవనాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్‌లు ఉంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించడానికి క్యారట్లు ఎంతగానో తోడ్పడతాయి.