మనసుని ఆహ్లాదపరిచే సువాసనలతో, చూడచక్కని ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి సుగంధ కొవ్వొత్తులు. ఈ కొవ్వొత్తులు వెదజల్లే చక్కటి పరిమళాలు ఆరోగ్య ప్రయోజనాల్నీ అందిస్తాయట. మరి అవేంటో చూద్దామా!
లావెండర్ క్యాండిల్ : లావెండర్ పరిమళం ఒత్తిడి, కుంగుబాటు, అలసట, తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్ నిస్తుంది.
నిద్రలేమితో బాధపడేవారికి చక్కటి సుఖ నిద్ర కలగాలంటే లావెండర్ సువాసనలు వెదజల్లే కొవ్వెత్తిని వెలిగించి బెడ్ రూమ్ లో పెట్టుకుంటే చాలు..హాయిగా నిద్రపడుతుంది..
మింట్ క్యాండిల్ : పుదీనా కొవ్వొత్తుల్ని రూమ్ లో పెట్టుకుంటే మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది.
జాస్మిన్ క్యాండిల్ : మల్లె సువాజన కొవ్వెత్తి నుంచి వచ్చే సువాసన భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
జాస్మిన్ క్యాండిల్ : శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని అదుపు చేయడంలో మల్లెపూల పరమళాల కొవ్వొత్తి ఎంతో మేలు చేస్తుంది.
రోజ్ క్యాండిల్ : నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ గులాబీ సువాసనల కొవ్వొత్తుల్ని వెలిగిస్తే మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
రోజ్ క్యాండిల్ : తలనొప్పిగా ఉండి నిద్ర పట్టని సమయంలో రోజ్ క్యాండిల్ వెలిగించి రూమ్ లో పెట్టుకుంటే తలనొప్పి తగ్గి చక్కటి నిద్రపడుతుంది.
అలాగే జాజిపూల పరిమళాలే కాకుండా ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాల పరిమళాలు వెదజల్లే కొవ్వొత్తులు మన మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి..ఇంటికి అందాన్ని కూడా ఇస్తాయి.