జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే, మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం  - హెలెన్ కెల్లర్

ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ ఎప్పటికప్పుడు చేసేయాలి  - మార్క్ ట్వెయిన్

తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి - డేవిడ్ బ్రింక్ లీ

సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా - హెర్బర్ట్ బయార్డ్ స్వోప్

నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే.. ఒక్కసారి జీవించినా చాలు - మే వెస్ట్

తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి.. శత్రువులే ఉండరు  - బెంజమిన్ ఫ్రాంక్లిన్

సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువగా పొందేవాళ్లు కాదు.. ఇతరులకు ఇచ్చేవాళ్లు - జాక్సన్ బ్రౌన్

జీవితంలో అసాధ్యమైన ప్రయాణం అంటే.. అసలు ప్రారంభించనిది. ప్రారంభం లేని పనే అసాధ్యంగా కనిపిస్తుంది  - ఆంథోనీ రాబిన్స్

ఈ రోజుతో మీ జీవితం ముగుస్తుందనగా.. ఏ పనులు చేయకపోయినా పరవాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి  - పాబ్లో పికాసో