వాట్సాప్ యూజర్లు రెండు మొబైల్ ఫోన్‌లలో ఒకే వాట్సాప్ నంబర్‌ను వినియోగించుకోవచ్చు.

ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన లింక్డ్ డివైజ్ ఫీచర్ మరింత విస్తరించనుంది. 

లేటెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌ల బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ ఇంకా  అందుబాటులోకి రాలేదు.

రాబోయే నెలల్లో వాట్సాప్ ఫీచర్ అందరికీ అందుబాటులో రావచ్చు.

ప్రస్తుత అకౌంట్ ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. 

యూజర్లు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు వంటి 4 ఇతర డివైజ్‌లకు లింక్ చేసేందుకు అనుమతిస్తుంది. 

రెండు ఫోన్‌లలో ఒక వాట్సాప్ నంబర్‌కు లాగిన్ అయ్యేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. 

ఇకపై రెండు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.