వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.

దురదను తగ్గించడమే కాదు.. డాండ్రఫ్ పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను వేపాకు అరికడుతుంది.

రెండు గుపిళ్ల నిండుగా వేపాకు తీసుకొని 4-5 కప్పుల వేడి నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేయండి.

మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోండి.

మిగిలిపోయిన వేపాకులను పేస్ట్‌గా చేసుకొని మాడుకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది.

ఆపిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు.

ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది.

ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి.

షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు.

కొద్ది రోజులపాటు చేయడం వల్ల డాండ్రఫ్‌ను కూడా అరికట్టవచ్చు.

తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి.

నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. 

నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. 

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది. 

డాండ్రఫ్ తగ్గే వరకూ రోజూ ఇలా చేయాలి.