2019-2021 మధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక మహిళ భర్త నుంచే భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటుందోంట. నవంబర్ 25 మహిళపై దాడులకు వ్యతిరేక దినం సందర్భంగా ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.

దేశంలోని 29.3 శాతం మహిళలపై భర్తలు భౌతిక, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.

ఇది దేశవ్యాప్తంగా ఉన్న సగటు కాగా, అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 44.4 శాతం మహిళలు ఈ వేధింపులు ఎదుర్కొంటున్నారట.

ఈ లెక్కన కర్ణాటక రాష్ట్రంలోని మహిళల్లో దాదాపుగా సగం మంది తమ భర్తల నుంచి భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు.

ఆ తర్వాత బిహార్, మణిపూర్ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో 40 శాతం మహిళలు ఈ వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు.

మన పొరుగు రాష్ట్రం తమిళనాడు 38 శాతం వేధింపులతో నాలుగవ స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం 37 శాతం వేధింపులతో ఐదో స్థానంలో ఉంది.

అతి తక్కువగా నాగాలాండ్ రాష్ట్రంలో 6.4 శాతం మంది మహిళలు తమ భర్తల నుంచి భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు.

అక్షరాస్యత పరంగా ముందంజలో ఉన్న కేరళలో 9.9 శాతం ఈ వేధింపులు ఉన్నట్లు సర్వే తెలిపింది.