ప్రపంచంలోనే మొట్ట మొదటి శాఖాహార నగరం.. ‘పాలిటానా’..

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో 55 కి.మీ దూరంలో ఉన్న ‘పాలిటానా’.. నగరం నిండా దేవాలయాలే ఉండటం మరో విశేషం..

‘పాలిటానా’ నగరం జైన మతస్థులకు చెందిన ఒక పవిత్ర  పుణ్యక్షేత్రం..ఇక్కడ జంతువులను చంపడం చట్టప్రకారం నేరం..

2014 సంవత్సరంలో ఈ ప్రాంతంలో జంతువుల వధించటంపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. అప్పటి నుండి ఇక్కడ ఒక్క జంతువు కూడా చంపబడలేదు.

ఈ నగరంలో జంతువుల వధించటం జరిగితే తాము ప్రాణత్యాగం చేస్తామని వందల మంది జైన సన్యాసులు నిరాహార దీక్ష ద్వారా తెలియజేయడంతో ప్రభుత్వం జంతు వధను నిషేధించింది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వాటిని మూసి వేసేలా చేసింది. దీంతో ఈ నగరాన్ని మాంసం లేని శాఖాహార ప్రాంతంగా ప్రకటించారు.

నగరంలో జైన సన్యాసులతో పాటు ప్రజలు కూరగాయాలు,పాలు, నెయ్యి, వెన్న లాంటివి తీసుకుంటారు.

జైనుల రక్షకుడైన ఆదినాథ ఒకప్పుడు ఇక్కడి కొండలపై నడయాడారని జైనులు నమ్ముతారు. అటువంటి పవిత్ర ప్రాంతంలో జంతువు వధలు ఉండకూడదని నిర్ణయించారు.

పాలిటానా ప్రపంచంలో 1000కి పైగా దేవాలయాలు కలిగిన ఏకైక పర్వతం అనే రికార్డును కలిగి ఉండటం మరో విశేషం..