పిల్ల‌ల‌తో వృక్షాస‌నం వేయిస్తే ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి.

చెట్టును పోలిన ఆస‌నం క‌నుక దీన్ని వృక్షాస‌నం అంటారు.

రెండు కాళ్లూ ద‌గ్గ‌ర పెట్టుకొని నిల‌బ‌డాలి. 

మెల్ల‌గా కుడికాలును పైకిలేపి కుడి పాదాన్ని ఎడ‌మ తొడ మీద ఆనించి అరికాలితో కొద్దిగా నొక్కుతున్న‌ట్లుగా ఉంచి ఒక్క కాలిమీద నిల‌బ‌డాలి. 

మెల్ల‌గా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల‌నూ భుజాల మీదుగా త‌ల‌పైకి తిన్న‌గా తీసుకెళ్లి న‌మ‌స్కార ముద్ర‌లో ఉంచాలి. 

చూపును ముక్కు అంచు మీద కేంద్రీక‌రించాలి.

ఈ ఆస‌నంలో ఉండ‌గ‌లిగినంత సేపు ఉండాలి.

మెల్ల‌గా చేతుల‌ను, కాలును కిందికి దింపి సేద‌తీరాలి. 

రెండో కాలితోనూ ఇలాగే చేయాలి. 

రెండు కాళ్ల‌తో క‌లిపి రోజూ ఐదు నిమిషాలు చేస్తే స‌త్ఫ‌లితం ఉంటుంది. 

ఈ ఆస‌నం ద్వారా మ‌న‌ల్ని మనం నియంత్రించుకోగ‌లుగుతాం.

క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. 

ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. 

ప‌నిమీద ధ్యాస నిలుపుతారు. 

పిల్ల‌ల్లో శారీర‌క, మాన‌సిక ఎదుగుద‌ల బాగుంటుంది.