ఇవి ప్రపంచంలో ఖరీదైన కూరగాయ.. కిలో దుంపలు ధర రూ.50వేలు..చూడటానికి మన బంగాళదుంపల్లా కనిపిస్తాయి

ఫ్రాన్స్‌లోని ‘ఇలే డీ నాయిర్మౌషియర్’ అనే దీవిలో మాత్రమే వీటిని సాగుచేస్తారు.

ఈ దుంపలను ఫ్రాన్స్‌లో ‘లా బొన్నొట్టే’ అంటారు.

ఈ దీవి అంతా ఈ సాగు ఉండదు. కేవలం 50 చదరపు మీటర్ల ప్రదేశంలో మాత్రమే ఆ దుంపలను సాగు చేస్తున్నారు.

ఆ దీవిలో ఓరకమైన ఇసుక నేల ఈ దంపల పంటకు అనువుంగా ఉంటుంది. అందుకే ఇక్కడ మాత్రమే సాగు చేస్తున్నారు.

ఆ దుంపల సాగులో ఎరువులు, పురుగుమందులు వాడరు. సముద్రంలో లభించే ఓ రకమైన గడ్డిని ఎరువుగా ఉపయోగిస్తారు.

సాగు ప్రారంభించిన 3 నెలలకు అంటే ఏటా ఫిబ్రవరిలో సాగు ప్రారంభించగా పంట మేలో దిగుబడి వస్తుంది.

ఈ దుంపలను మిషన్లతో కాకుండా కేవలం చేతులతోనే ఇసుక నుంచి బయటకు తీస్తారు.

ఈ దుంపల రుచిలో ఉప్పగా ఉంటాయి. కానీ ఈ దుంపలు కొన్ని రకాల వ్యాధులను నయం చేయడంలో బాగా పనిచేస్తున్నాయని చెబుతారు.

ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ దుంపల ధర కేజీ 500 యూరోలకు పైగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.43వేలు. ఒక్కోసారి వీటి ధర రూ.50వేల దాకా పలుకుతుంది.

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన 5 కూరగాయల్లో ఈ దుంపలు కూడా చేరాయి.  వీటిని సలాడ్లు, సూప్‌లు, క్రీమ్స్, ప్యూరీల్లో వాడుతున్నారు.