ఆడవాళ్లు అందానికి చాలా ప్రాముఖ్య‌త‌నిస్తారు

కొంతమంది మోచేతులు, మోకాళ్లు, కాలిమడమలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

దీని వల్ల అవి నల్లగా, గరుకుగా మారతాయి.

ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

నిమ్మచెక్కను తీసుకొని మోచేతులపై నలుపుగా ఉన్నచోట కాసేపు రుద్దండి.

ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోండి.

రెండు రోజులకోసారి చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

నిమ్మచెక్కను ఉప్పులో ముంచి రుద్దినా మోచేతులపై ఉన్న నలుపు తగ్గుమఖం పడుతుంది.

పెరుగు మోచేతుల నల్లధనాన్ని పోగొడుతుంది.

ఒక గిన్నెలో రెండు స్పూన్ల పెరుగు, కొద్దిగా వైట్‌ వెనిగర్‌ తీసుకొని మిక్స్‌ చేయండి.

దానిని మోచేతులకు, మోకాళ్లకు రాసుకోవాలి.

ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టవల్‌తో పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. 

క్రమం తప్పకుండా అలాచేస్తే నలుపు విరుగుతుంది.