చర్మ సంరక్షణ నుండి జుట్టు పెరుగుదల వరకు కలబందలో అనేక ఉపయోగాలున్నాయి.

నిరభ్యంతరంగా కలబందను అన్నివేళలా ఉపయోగించవచ్చు.

అలోవెరాగా ప్రసిద్ధి చెందిన కలబందను అందం కోసం చాలా ఇళ్లలో పెంచుతారు.

ముఖ్యంగా చ‌లికాలంవస్తే అనేక చర్మ సమస్యలు ఇబ్బందులు పెడ‌తాయి.

చర్మం పొడిబారడంతోపాటు జుట్టులో చుండ్రు సమస్యలుకూడా పెరుగుతాయి.

అలాంటి సమస్యలను పరిష్కరించాలంటే కలబంద ఉత్తమ పరిష్కారం.

అలోవెరాలో చర్మానికి మేలుచేసే ద్రవం చాలా ఉంటుంది.

చర్మంపై ఉన్న బ్లాక్ హెడ్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ రాత్రిపూట కాస్త కలబంద రసాన్ని ముఖానికి పట్టించాలి.

మరుసటి రోజు ఉదయం నీళ్లతో కడిగేసుకుంటే నలుపుదనం పోయి ముఖం చాలా కాంతివంతంగా కనిపిస్తుంది.

కాలిన గాయాలను నయం చేయడంలోకూడా ఇది ఉపయోగపడుతుంది.

మొటిమలను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. 

తలపై ఉన్న మృతకణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

రక్త ప్రసరణను ప్రోత్సహించడం ద్వారా కొత్త జుట్టు పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది.

చుండ్రు, జుట్టు రాలడాన్ని కూడా నయం చేస్తుంది.