ప్రపంచం వ్యాప్తంగా ఆయా దేశాలకు చెందిన పరిస్థితులు, సంప్రదాయలను బట్టి చట్టాలను రూపొందించుకుంటుంటారు.
అటువంటి కొన్ని వింత చట్టాల గురించి తెలిస్తే ఇటువంటి చట్టాలు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోతాం..అటువంటి వింత చట్టాలే ఇవి..!!
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న ఓ ఎడారిలో కాక్టస్ (ఎడారి మొక్కలు)ను నరికితే కనీసం 25 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి.
థాయిలాండ్ లోని మాయ్ ఖావ్ బీచ్ లో ఫోటోలు,వీడియోలు తీయకూడదు. తీశారంటే ఉరి శిక్ష పడుతుందట. దానికి కారణం బలమైనదే ఉందిలెండి..
ఆస్ట్రేలియాలో హోమింగ్ పావురాలను పట్టుకోవడం నిషేధం. ఎవరైనా వాటిని పట్టుకున్నా..పంజరంలో పెట్టినా..జైలు శిక్ష లేదా రూ. 20,000 జరిమానా ఉంటుంది.
స్విట్జర్లాండ్‌లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్‌ను ఫ్లష్ చేస్తే జైలు శిక్ష ఖాయం.
స్టోలాండ్ ఓ ప్రత్యేక నృత్యం సంప్రదాయంగా ఉంది. ఈ డ్యాన్స్ లో పురుషులు కూడా అమ్మాయిల్లా స్కర్టులు ధరిస్తారు. లేదంటే శిక్ష విధిస్తారు..
ఇటలీలో పురుషులు బహిరంగంగా స్కర్టులు ధరిస్తే జైలుకు వెళ్లాల్సిందే..
ఈజిప్ట్‌లో బెల్లీ డ్యాన్స్ కేవలం మహిళలకు మాత్రమే. మగవారు సరదాకి కూడా పబ్లిక్ ప్లేస్‌లో బెల్లీ డ్యాన్స్ చేస్తే జైలుకు వెళ్లే అవకాశం ఉంది.