దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పొటాషియం, క్యాల్షియం లాంటి మినరల్‌తోపాటు పీచు తగినంత ఉంటుంది.
విటమిన్ - సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే ప్యూనిక్ కొల్లాజెన్, ప్యూనిక్ యాసిడ్ ఉంటాయి.
ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరుగుతుంది.
దానిమ్మలో గింజల్లోనే కాదు.. దానిమ్మ తొక్కలోనూ అనేక పోషకాలు ఉంటాయి.
దానిమ్మ తొక్కల్లో పోషకాలు బ్రెయిన్ షార్ప్‌గా చేస్తాయి.
తరచుగా దానిమ్మ తొక్కల టీ తాగితే మెదడు చురుకుగా ఉంటుంది.
గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
దగ్గు తగ్గుతుంది. కడుపులో సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి.
మొటిమలు, వాటి మచ్చలు, ముడతలు తొలగుతాయి.