కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా తన క్రేజ్‌ను రష్మిక అమాంతం పెంచేసుకుంది.

ఇక బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో పాగా వేయాలని చూసింది ఈ బ్యూటీ.

అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

రష్మిక నెక్ట్స్ మూవీ ‘మిషన్ మజ్ను’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.

సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక జంటగా నటించిన ‘మిషన్ మజ్ను’ జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇలా రష్మికకు బాలీవుడ్‌లో కష్టాలు తీరడం లేదని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.