ఈవెనింగ్ స్నాక్స్ గా పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్ చిప్స్, బిస్కెట్లు వద్దు.

నట్స్, డ్రైఫ్రూట్స్ మంచి స్నాక్స్.

వెంటనే ఆకలి వేయదు, పైగా శక్తినిస్తాయి. 

చాక్లెట్ లేదా పీనట్ బటర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 

స్నాక్స్ కింద కార్న్ ఫ్లేక్స్ ను ఓ కప్పు తీసుకోవచ్చు. 

అలాగే, ఓ కప్పు మొలకెత్తిన గింజలను తినొచ్చు.

చక్కెర జోడించని పీనట్ బటర్ (వేరుశనగ) ను కూడా తినొచ్చు. 

దీన్ని తీసుకుంటే రక్తంలో బ్లడ్ షుగర్ పెద్దగా పెరగదు.

మధుమేహం ఉన్న వారికి ఇదొక స్నాక్ ఆప్షన్.

మంచి పోషక విలువలు కలిగిన రాస్ బెర్రీస్ ను కూడా తీసుకోవచ్చు. 

దీని వల్ల మంచి పోషకాలతో పాటు బరువూ తగ్గొచ్చు. 

యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. 

ఈ స్నాక్స్ అన్నింటిలోనూ ఫైబర్ ఉండడం వల్ల తిన్న వెంటనే జీర్ణం కావు. 

నిదానంగా జీర్ణం అవ్వడం వల్ల మళ్లీ వెంటనే ఆకలి సమస్య తలెత్తదు. 

ఈ హెల్తీ స్నాక్స్ తో ఆకలి తీరడమే కాకుండా ప్రయోజనాలనూ సొంతం చేసుకోవచ్చు. 

వీటి ద్వారా వచ్చిన శక్తి ఆ రోజంతా సరిపోతుంది. రాత్రి డిన్నర్ ను పరిమితం చేసుకోవచ్చు.